TS High court: ప్రజాభవన్‌ వద్ద కారు ప్రమాదం కేసు.. సాహిల్‌కు హైకోర్టులో ఊరట

ప్రజాభవన్‌ (Praja Bhavan Accident) వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌కు ఊరట లభించింది.

Published : 09 Jan 2024 19:49 IST

హైదరాబాద్‌ : బేగంపేట ప్రజాభవన్‌ (Praja Bhavan Accident) వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ (Former MLA Shakeel) కుమారుడు సాహిల్‌కు ఊరట లభించింది. సాహిల్‌ను అరెస్టు చేయొద్దని పంజాగుట్ట పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, ఈనెల 17న పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసులో పేరును తొలగించాలని సాహిల్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినందుకే పంజాగుట్ట పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘పోలీసులు కావాలని పిటిషనర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆసిఫ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఆ తర్వాత ఆసిఫ్‌పై ఒత్తిడి తెచ్చి సాహిల్‌ పేరు చెప్పించారు. గతంలో అతనిపై 15 కేసులు ఉన్నట్టు చూపించారు’’ అని న్యాయవాది తెలిపారు. తప్పు చేయకపోతే నిందితుడు దుబాయ్‌ ఎందుకు పారిపోయారని హైకోర్టు ప్రశ్నించింది. తప్పుడు కేసు బనాయించిన పోలీసులు.. అరెస్టు చేస్తారనే భయంతోనే దుబాయ్‌ వెళ్లాడని న్యాయవాది కోర్టుకు తెలిపారు. కారు ప్రమాద ఘటనకు సంబంధించి కేసు డైరీని సమర్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను 24వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు