TS: రాజ్‌భవన్‌లో సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన సంబరాలు అంబరాన్ని అంటాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై

Published : 15 Jan 2021 03:54 IST

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన సంబరాలు అంబరాన్ని అంటాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆమె కుటుంబసభ్యులు, రాజ్‌భవన్‌ సిబ్బంది పాల్గొన్నారు. పల్లె వాతావరణం ప్రతిబింబించే రీతిలో తీర్చిదిద్దిన ప్రాంగణంలో సంప్రదాయ పొంగల్ వంటకాన్ని గవర్నర్ తయారు చేశారు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల స్ఫూర్తి చాటుతూ వినూత్న రీతిలో కొవిడ్ టీకా, ఆత్మ నిర్భర్‌ భారత్ అభియాన్ సందేశాలతో కూడిన అందమైన గాలిపటాలను గవర్నర్ ఉత్సాహంగా ఎగురవేశారు. ఈ నెల 16న దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న భారీ టీకా కార్యక్రమాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గాలిపటాలపై ఈ సందేశాలు ఉన్నాయని చెప్పారు.

ఇవీ చదవండి..

ముగిసిన అఖిలప్రియ పోలీస్‌ కస్టడీ

దేశవ్యాప్తంగా 31న పల్స్‌ పోలియో



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని