టీకా వేయించుకున్నా.. నా దగ్గర కొనరూ!

కరోనా మహమ్మారి అతలాకుతలం చేయని రంగమంటూ లేదు. ముఖ్యంగా చిరు వ్యాపారుల విక్రయాలపై తీవ్రంగా దెబ్బకొట్టింది. రోజుకో ఇంత అని సంపాదించేవారి పొట్ట కొట్టింది.

Published : 17 Jul 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి అతలాకుతలం చేయని రంగమంటూ లేదు. ముఖ్యంగా చిరు వ్యాపారుల విక్రయాలపై తీవ్రంగా దెబ్బకొట్టింది. రోజుకో ఇంత అని సంపాదించేవారి పొట్ట కొట్టింది. ఇక్కడ కనిపించే వీధి వ్యాపారిదీ అదే పరిస్థితి. కరోనా భయంతో వినియోగదారులు రావడం తగ్గిపోవడంతో వినూత్న పంథాను ఎంచుకున్నాడు. తాను వ్యాక్సిన్‌ వేయించుకున్నా అని చూపుతూ స్టిక్కర్‌ వేయించుకున్నాడు. తన వద్ద కొనుగోలు చేస్తే వైరస్‌ భయం అక్కర్లేదని భరోసా ఇస్తున్నాడు. ఆ విధంగానైనా తన వద్దకు ఓ నలుగురు వినియోగదారులు రాకపోరా అన్న ఆశ ఈయనిది. మేఘాలయాలోని షిల్లాంగ్‌లో కనిపించిందీ దృశ్యం. ఇందిరా అనే మహిళ ఈ ఫొటోను ట్వీట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అద్భుతమైన ఆలోచన అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని