Hyderabad: హైదరాబాద్‌ నుంచి తిరుపతి, ఔరంగాబాద్‌లకు ప్రత్యేక రైళ్లు..

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Updated : 28 Apr 2022 20:58 IST

పాఠశాలలకు వేసవి సెలువులు వచ్చాయి. ఈ సమయంలో వేసవి విడిదికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకోవడం కనిపిస్తుంది. అదే సమయంలో తమ మొక్కులు తీర్చుకునేందుకు పుణ్య క్షేత్రాలకు వెళుతుంటారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ పెరుగుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని పెరిగిన రద్దీ దృష్ట్యా ప్రజల అవసరాలకుసరిపడా సర్వీసులను నడిపించాలని రైల్వే అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతి, ఔరంగాబాద్‌లకు 20 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శనివారం హైదరాబాద్ నుంచి తిరుపతి, మంగళవారం తిరుపతి నుంచి హైదరాబాద్, ఆదివారం తిరుపతి నుంచి ఔరంగాబాద్, సోమవారం ఔరంగాబాద్ నుంచి తిరుపతి వరకు ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని