Supreme court: ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయండి: సుప్రీంకోర్టు

ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 15 Dec 2023 19:24 IST

దిల్లీ: ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓఖా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. 

ఒకే రకమైన అంశంపై పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోగా మరికొన్ని కేసులు పెట్టి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారు. ఒక కేసులో సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ జరపాలని ఆదేశించింది. కాజ్‌ ఆఫ్‌ యాక్షన్‌ హైదరాబాద్‌లో జరిగినట్టు ఉన్నందున అన్ని కేసుల విచారణ ఒకే చోట జరగాలి’’ అని లూథ్రా వాదించారు. లూథ్రా వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఐడీని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని