Telangana high Court: 2008 డీఎస్సీలో మిగిలిన పోస్టులను మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలి: హైకోర్టు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన 2008 డీఎస్సీ నోటిఫికేషన్‌లో మిగిలిన పోస్టులను అప్పటి మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు...

Published : 30 Sep 2022 01:09 IST

హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన 2008 డీఎస్సీ నోటిఫికేషన్‌లో మిగిలిన పోస్టులను అప్పటి మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 30వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2008లో నోటిఫికేషన్‌ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 30 శాతం పోస్టులను డీఈడీ అభ్యర్థులకు రిజర్వ్‌ చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బీఈడీ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పు వెల్లడించింది. అప్పటి నోటిఫికేషన్‌లో 3,500 పోస్టులు భర్తీ కాలేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణలో సుమారు 1815 ఖాళీలు ఉండగా.. ఏపీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులను నియమించారన్నారు. ఆ ఖాళీలను 2008 డీఎస్సీలో మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని