CM Jagan: విశాఖలో స్మార్ట్‌సిటీ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్‌ఏడీ కూడలిలో పై వంతెనను..

Updated : 15 Nov 2022 15:54 IST

విశాఖపట్నం:  శుక్రవారం సాయంత్రం విశాఖ నగరంలో పర్యటించిన సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఏడీ కూడలిలో రూ.150 కోట్లతో నిర్మించిన పైవంతెనను సీఎం ప్రారంభించారు. అనంతరం విశాఖ బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన జీవీఎంసీ  స్మార్ట్‌ సిటీ పార్కును ప్రారంభించారు. ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‌ నెక్కెల నాయుడుబాబు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం ఆశీర్వదించారు. ఆతర్వాత వైజాగ్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక, రవితేజ పెళ్లి విందుకు హాజరయ్యారు. కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ తదితరులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని