ముగ్గురు తితిదే బోర్డు సభ్యులపై పిల్‌ దాఖలైనట్టుపత్రికాప్రకటన ఇవ్వండి: హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్...

Updated : 04 Jan 2022 16:46 IST

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసినా ఎవరూ కౌంటర్లు దాఖలు చేయలేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 15 మంది నోటీసులు తీసుకోగా.. ముగ్గురు సభ్యులు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నోటీసులు తీసుకోని బోర్డు సభ్యులు అల్లూరి మహేశ్వరి, ఎమ్మెల్యే రాం భూపాల్ రెడ్డి, ఎంఎన్‌ శశిధర్ లపై పిల్ ఫైల్ అయినట్టు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని