AP News: వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన

Updated : 24 Sep 2021 22:26 IST

అమరావతి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. వైద్యారోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆసుపత్రుల నుంచి భోధనాసుపత్రుల వరకు సుమారు 14,200 పోస్టులు భర్తీ చేయాలని  నిర్ణయించారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారభించి, నవంబర్‌ 15 నాటికి ఉద్యోగాల భర్తీ ముగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండవద్దని సీఎం ఆదేశించారు.

ఆసుపత్రుల్లో ఔషధాల కొరత లేదు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరత లేదని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ భాస్కర్‌ తెలిపారు. కొవిడ్‌ వల్ల ఐదారురెట్లు అధికంగా ఔషధాలు కొనుగోలు చేశామని సీఎంకు వివరించారు. ఈ-ఔషధి వెబ్‌సైట్‌లో ఎక్కడా సమస్యలు లేవని పేర్కొన్నారు. అవసరాలకు అనుగుణంగా ఔషధాలు సరఫరా చేస్తున్నామని వివరించారు.‘‘క్యాన్సర్‌ ఔషధాలు అవసరం కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటివరకు 2వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మొత్తం డెంగ్యూ కేసుల్లో సగం విశాఖ జిల్లాలోనే నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరాలకు సరిపడినన్ని ఔషధాలు, టెస్ట్‌ కిట్లు ఉన్నాయి’’ అని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని