AP News: దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం..

Updated : 14 Jul 2021 14:17 IST

నీట మునిగిన గండి పోచమ్మ ఆలయం

దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద అంతకంతకూ పెరగడంతో పోచమ్మగండి వద్ద ఉన్న గండి పోచమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. దీంతో దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఆలయాన్ని ఆనుకొని ఉన్న ఇళ్లన్నీ నీట మునిగాయి. ఫలితంగా బాధిత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దేవీపట్నం, తొయ్యేరు మధ్య ఆర్అండ్‌బీ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పూడిపల్లి, తొయ్యేరు, ఏవేరవరం, కేవేరవరం, దండంగి గ్రామాల్లో వరద నీరు చుట్టుముట్టింది. పోలవరం ఎగువ కాపర్ డ్యాం వద్ద వరద నీరు పెరగటంతో పాటు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోచమ్మ గండి నుంచి పాపికొండలు వెళ్లే విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని