ICMR sero survey: పిల్లల్లో 55%.. పెద్దల్లో 61% కొవిడ్‌ యాంటీబాడీలు

తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది..

Updated : 23 Jul 2021 18:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే ఫలితాలను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ప్రకటించింది. రాష్ట్రంలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ సీరో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సీరో సర్వేలో 60 శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు గుర్తించినట్లు తెలిపింది. వారిలో 55 శాతం పిల్లలు, 61 శాతం మంది పెద్దవారిలో యాంటీబాడీలు గుర్తించామని పేర్కొంది. అలాగే 82.4 శాతం మంది హెల్త్‌కేర్‌ వర్కర్లలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపింది. తొలి విడతలో 0.33 శాతం, రెండో విడతలో 12.5 శాతం, మూడో విడతలో 24.1 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. జాతీయ స్థాయిలో గత ఏడాది 24 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలను గుర్తించగా.. ప్రస్తుతం అది 67 శాతానికి చేరింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో 94 శాతం సీరో పాజిటివిటీ రేట్ ఉన్నట్లు ప్రకటించింది.

తద్వారా కరోనా వ్యాక్సిన్‌లు సమర్ధంగా పనిచేస్తున్నాయనే విషయం స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జూన్‌ నెలలో చేపట్టిన సర్వేను అన్ని వయసుల వారిపై చేపట్టగా.. ఈసారి 6-9 ఏళ్ల వయసున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. దాదాపు 55శాతం పిల్లల్లో (6 నుంచి 9ఏళ్ల) సీరో పాజిటివ్‌గా తేలగా.. యుక్త వయసు పిల్లల్లో 61 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగానే వ్యాక్సిన్లు అందించడం వల్ల వారిలో కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు నిపుణులు అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని