
Published : 28 Aug 2021 13:20 IST
TS News: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఈడీ కేసులు విచారణ జరిపే నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు రేవంత్‌తో పాటు తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు పంపింది. వీరితో పాటు కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో సెబాస్టియన్, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరుసలేం, వేం కృష్ణ కీర్తన్‌లు ఉన్నారు.
ఇవీ చదవండి
Tags :