NEET: దేశవ్యాప్తంగా ‘నీట్‌’ పరీక్ష ప్రారంభం

దేశవ్యాప్తంగా కాసేపట్లో జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) ప్రారంభం కానుంది.

Updated : 12 Sep 2021 15:39 IST

హైదరాబాద్‌, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష మొదలైనప్పటికీ మధ్యాహ్నం 1.30 గంటల్లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే నిబంధన ఉండటంతో విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లక్ష మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఏపీలో 10 పట్టణాల్లోని 151.. తెలంగాణలో 7 పట్టణాల్లోని 112 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్‌ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నారు. హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని