ఎల్లుండి కేబినెట్‌ భేటీ..50వేల ఉద్యోగాలపై చర్చించే అవకాశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఎల్లుండి మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. దళిత బంధు పథకంపై ప్రధానంగా చర్చించి

Updated : 30 Jul 2021 20:04 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఎల్లుండి మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. దళిత బంధు పథకంపై ప్రధానంగా చర్చించి, హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. దళిత బీమా, చేనేత బీమా పథకాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 50వేల ఉద్యోగాల అంశంపై కూడా మంత్రివర్గం మరోసారి చర్చించనుంది. పంటలకు సాగునీరు, ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖారారు గెజిట్‌పై, కొవిడ్‌ మూడోదశ సన్నద్ధతపై కేబినెట్‌ చర్చించే అవకాశముందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని