AP News: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు

Updated : 28 Dec 2021 15:49 IST

హిందూపురం అర్బన్‌: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు విఫలయత్నం చేశాయి. పట్టణ సమీపంలోని డంపింగ్‌ యార్డు తరలించే విషయమై జరుగుతున్న జాప్యంపై సామాజిక మాధ్యమాల్లో తెదేపా, వైకాపా నాయకులు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు వైకాపా నాయకులు బహిరంగ చర్చకు సవాల్‌ విసరడంతో తెదేపా నేతలు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఇవాళ తెదేపా నాయకులు బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు వైకాపా నాయకులు సైతం ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వైకాపా నాయకులను మార్గం మధ్యలోనే నిలువరించారు. తెదేపా నేతలు ‘జై బాలయ్య’ వైకాపా నేతలు ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని