Published : 22 Oct 2021 01:49 IST

Travel influencer: ఏడాది చిన్నోడు.. ఎంచక్కా తిరిగి సంపాదిస్తున్నాడు!

వాషింగ్టన్‌: ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.. ముద్దుముద్దు మాటలు చెప్తున్నాడు.. అయితేనేం, ఆ తప్పటడుగులు, ముద్దు మాటలతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయాడు. నెలకు దాదాపు 75వేల రూపాయలు సంపాదించేస్తున్నాడు! అమెరికాకు చెందిన ఈ చిన్నోడి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

2020 అక్టోబర్ 14న జన్మించిన ఆ బుడతడి పేరు బ్రిగ్స్‌. పుట్టిన మూడు వారాలకే తొలి విహార యాత్ర మొదలుపెట్టేశాడు. ఈ ఏడాదిలో 45 సార్లు విమానం ఎక్కి, అమెరికాలోని 16 రాష్ట్రాలను చుట్టేశాడు. అలాస్కాలో ఎలుగుబంట్లు, ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్‌లో తోడేళ్లు, కాలిఫోర్నియాలోని బీచ్‌లు.. తను వెళ్లిన ప్రతి రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలను ఆస్వాదించాడు. జలపాతాల వద్ద జలకాలాడాడు. నదుల్లో ప్రయాణించాడు. ఈ విషయాలన్నింటినీ whereisbriggs అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పంచుకొని పాపులరయ్యాడు. బ్రిగ్స్‌ ఖాతాను ప్రస్తుతం 30 వేల మందికి పైగా అనుసరిస్తున్నారు. అతి పిన్నవయస్కుడైన ట్రావెల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుపొందిన ఈ చిన్నారి నెలకు వెయి డాలర్లు (సుమారు 75 వేలు)సంపాదిస్తున్నాడు!

అసలు ఈ పర్యటనలు చేయాలన్న ఆలోచన బ్రిగ్స్ వాళ్ల అమ్మ జెస్‌ది. ఆమె పార్ట్‌ టైమ్‌ టూరిస్ట్స్‌ అనే బ్లాగ్‌ నడిపేది. ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఆమెకు బ్లాగ్‌ ద్వారా కొంత మొత్తం అందుతుంది. ‘నేను 2020లో గర్భం దాల్చినప్పుడు, ఇక నా కెరీర్ ముగిసిపోయిందని చాలా ఆందోళన చెందాను. చిన్నపిల్లలతో నా వృత్తిలో కొనసాగడం సాధ్యమా అనే ఆలోచనే అందుకు కారణం’ అని జెస్ మీడియాకు వెల్లడించారు. ‘అయితే నా భర్త, నేను ఎలాగైనా మా ట్రావెలింగ్‌ను కొనసాగించాలనుకున్నాం. బేబీ ట్రావెల్‌పై ఉన్న సోషల్ మీడియా ఖాతాల గురించి వెతికాం. అయితే నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ పనేదో నేను చేయాలనుకున్నా. అది సరదాగా, అకట్టుకునేలా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నా. అలాగే మొదటిసారి చిన్నారులతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఎదురయ్యే ఇబ్బందులను వివరించాలనుకున్నా’ అంటూ ఆమె వివరించారు. అక్కడి నుంచే whereisbriggs పుట్టుకొచ్చిందన్నారు. 

కొవిడ్ సమయంలో కూడా వీరి ప్రయాణం కొనసాగింది. ఎక్కువ రద్దీ లేని ప్రాంతాలను చూసుకొని, నిబంధనలు పాటిస్తూ వారు ముందుకెళ్లారు. ఇప్పుడు వారు యూరప్ ట్రిప్ ప్లాన్‌చేస్తున్నారు. మరోవిషయం ఏంటంటే.. ఈ బేబీ బ్రిగ్స్‌కు స్పాన్సర్ కూడా ఉన్నారు. ఈ చిన్నారికి డైపర్లు, వైప్స్‌ అందిస్తారట.           
Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని