AP News: ఉక్కు ఉద్యమం@ 200 రోజులు.. కార్మికుల భారీ మానవహారం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుంది.

Updated : 29 Aug 2021 10:10 IST

విశాఖ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం 200 రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు భారీ మానవహారాన్ని చేపట్టాయి. అగనంపూడి నుంచి అక్కిరెడ్డి పాలెం వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో గాజువాక వద్ద తెదేపా మాజీ ఎమ్మెల్యే పళ్ల శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన 10 కి.మీ మానవహారంలో ఉక్కు పరిశ్రమ కార్మికుల కుటుంబాలు, విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవహారం, ర్యాలీ నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని