Avinashreddy:ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్టుపై లోక్‌సభ సచివాలయం బులెటిన్‌

కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అరెస్టుపై లోక్‌సభ సచివాలయం మంగళవారం బులెటిన్‌ విడుదల చేసింది.

Published : 04 Jul 2023 20:52 IST

దిల్లీ: కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అరెస్టుపై లోక్‌సభ సచివాలయం మంగళవారం బులెటిన్‌ విడుదల చేసింది. అవినాశ్‌ రెడ్డి అరెస్టుపై సీబీఐ సమాచారం ఇస్తూ రాసిన లేఖ సోమవారం తమకు అందినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. లేఖలో సీబీఐ పేర్కొన్న అంశాలను లోక్‌సభ సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది.  

‘‘జూన్‌ 3న అవినాశ్‌ను అరెస్టు చేసి  వెంటనే రూ.5 లక్షల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో విడుదల చేశాం. అరెస్టు చేస్తే వెంటనే బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే అవినాశ్‌ను విడుదల చేశాం’’ అని లేఖలో సీబీఐ పేర్కొన్నట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని