Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 01 Dec 2022 13:16 IST

1. మాపై ఈడీ, సీబీఐ కేసులు.. నీచమైన రాజకీయ ఎత్తుగడ: ఎమ్మెల్సీ కవిత

తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం భాజపా హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS High Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్‌

సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ముగ్గురు నిందితులకు బెయిర్‌ మంజూరైంది. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.3 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని నిందితులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Twitter: యాపిల్‌తో వివాదం సద్దుమణిగింది: ఎలాన్ మస్క్‌ 

టెక్ దిగ్గజ సంస్థ యాపిల్‌తో తలెత్తిన వివాదం సద్దుమణిగిందని ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. యాపిల్‌ స్టోర్‌ నుంచి ట్విటర్‌ను నుంచి తొలగించే యోచన తమకు లేదని ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ తనతో స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. బుధవారం యాపిల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి టిమ్‌ కుక్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ఇరువురి మధ్య సుహృద్భావ సంభాషణలు జరిగినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Supreme Court: సుప్రీం చర్రితలో మూడోసారి.. మహిళా ధర్మాసనం

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరో అరుదైన ఘట్టం.. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ మహిళా బెంచ్‌ గురువారం పలు కేసులను విచారించనుంది. ఇందులో వైవాహిక గొడవలకు సంబంధించి 10 బదిలీ పిటిషన్లు, మరో 10 బెయిల్‌ పిటిషన్లు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Zelensky: మస్క్‌.. నువ్వు వచ్చి చూసి మాట్లాడు..: జెలెన్‌స్కీ ఆగ్రహం

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ట్విటర్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో మస్క్‌.. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధ విరమణ కోసం కొన్ని ప్రతిపాదనలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో జెలెన్‌స్కీ దీనిపై స్పందిస్తూ.. మస్క్‌ ఉక్రెయిన్‌ వచ్చి అలా మాట్లాడాలని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Neuralink: 6 నెలల్లో మనిషి మెదడులో చిప్‌.. మస్క్‌ కీలక ప్రకటన!

మనిషి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే సాంకేతికతకు సంబంధించి న్యూరాలింక్ (Neuralink) అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ (బీసీఐ) సాంకేతికతను మరో ఆరు నెలల్లో మానవులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌లో ఉన్న న్యూరాలింక్‌ (Neuralink) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. crime news: ముంబయిలో నడిరోడ్డుపై కొరియన్‌ యూట్యూబర్‌తో అసభ్య ప్రవర్తన..!

దక్షిణ కొరియాకు చెందిన ఓ యూట్యూబర్‌ ముంబయిలోని ఓ వీధిలో బహిరంగంగానే వేధింపులకు గురైంది. లైవ్‌స్ట్రీమింగ్‌ చేస్తుండగా ఓ ఆకతాయి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Gujarat Polling: గుజరాత్‌ పోలింగ్ వేళ.. భాజపా అభ్యర్థిపై దాడి

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ గురువారం కొనసాగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పోలింగ్‌ ప్రారంభానికి ముందు ఓ భాజపా అభ్యర్థిపై దాడి జరగడం స్థానికంగా కాస్త కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
 

9. Shashi Tharoor: వీడని సునందా పుష్కర్‌ కేసు.. శశిథరూర్‌కు నోటీసులు

తన భార్య సునందా పుష్కర్‌ మృతి కేసు నుంచి కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు ఊరట కల్పించడంపై దిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది పాటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ పోలీసులు సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన దిల్లీ హైకోర్టు.. కాంగ్రెస్‌ ఎంపీ థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Ap News: చిరుద్యోగులు, పొరుగుసేవలపై ప్రభుత్వం చిన్న చూపు.?

పదవీ విరమణ చేస్తున్న ఉన్నతాధికారుల కోసం కొత్త పోస్టులు సృష్టించి లక్షల్లో వేతనాలు సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. చిరు ఉద్యోగులపై మాత్రం చిన్నచూపు చూస్తోంది. వివిధశాఖల్లో చిరుద్యోగులు, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది. వీలైనంత వరకు తగ్గించుకోవాలంటూ ప్రభుత్వశాఖలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని