Updated : 06 Nov 2021 13:15 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Nawab Malik: వాంఖడే గుట్టు ఎవరు బయటపెడతారో..?

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు సహా మరో ఐదు కేసులు ఎన్‌సీబీ ముంబయి పరిధి నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. వాటిని ఏజెన్సీకి చెందిన సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది. దానిలో భాగంగా ప్రత్యేక బృందం(సిట్) శనివారం ముంబయికి రానుంది. మరోపక్క ఆర్యన్ కేసులో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడే సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. T20 World Cup: అదే జరిగితే.. బ్యాగ్‌ సర్దుకొని ఇంటికి తిరిగొస్తాం: జడేజా

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మేటి ప్రదర్శన(3/15) చేసిన సంగతి తెలిసిందే. టీ20 క్రికెట్‌లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు షమి 3/15, బుమ్రా 2/10 సైతం రాణించారు. దీంతో స్కాట్లాండ్‌ 85 పరుగులకే కుప్పకూలగా టీమ్‌ఇండియా 6.3 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలోనే గ్రూప్‌-2లో అఫ్గానిస్థాన్‌ (1.481), న్యూజిలాండ్‌ (1.277) కన్నా మెరుగైన రన్‌రేట్‌ (1.619) సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

T20 World Cup: భారత్‌ - స్కాట్లాండ్‌ మ్యాచ్‌.. కొత్త రికార్డులు

3. Amaravati Padayatra: నేడు ప్రకాశం జిల్లాలోకి అమరావతి ‘మహాపాదయాత్ర’

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన ఈ యాత్ర ఇవాళ ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర పెదనందిపాడులో ప్రారంభమైన 14 కి.మీ మేర సాగి ఇవాళ పర్చూరులో ముగియనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Mega 154: మాస్‌ పూనకాలు మొదలాయె.. మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి 154వ ప్రాజెక్ట్‌ షురూ అయ్యింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట్లో తెగ ట్రెండ్‌ అవుతోంది. చిరు లుక్‌ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Skylab Trailer: ఆకట్టుకునేలా ‘స్కైల్యాబ్‌’ ట్రైలర్‌

5. TS News: హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితంపై స్పందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస ఓటమిపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్పందించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని వ్యాఖ్యానించారు. తెరాస చాలా ఎన్నికలు చూసిందన్నారు. సాగర్‌, భాజపా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మరోవైపు తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Health Insurance: ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

ఇంట్లో ప్రతిఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. ఇది కరోనా నేర్పిన గుణపాఠాల్లో ఒకటి. అయితే, ఆరోగ్య బీమా అదనపు ఖర్చుగా కాకుండా.. మనపై మనం పెట్టుకుంటున్న పెట్టుబడిగా భావించాలి. ఇదిలా ఉంటే.. ప‌రిమితితో కూడిన బీమా హామీ సొమ్మును సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ద్వారా అంద‌జేస్తారు. చాలా ఆరోగ్య పాలసీలు కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: 10 వేలకు తగ్గిన కరోనా కేసులు

7. Samantha: మెగా కాంపౌండ్‌లో సామ్.. ఫొటోలు వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల రోడ్డుప్రమాదానికి గురై పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సాయిధరమ్‌ తేజ్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు రెండు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు, స్నేహితులు సందడి చేశారు. నటి సమంత సైతం ఈ వేడుకల్లో భాగమయ్యారు. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఆమె హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Online Meat Delivery: మెసేజ్‌ చేస్తే మేక.. కూత పెడితే కోడి!

కరోనా పరిస్థితుల నేపథ్యంలో పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఏర్పడింది. వినియోగదారుల భద్రత, శుభ్రతకు అనుగుణంగా వ్యాపార రంగం కూడ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటివద్దకే డెలివరీలకు డిమాండ్‌ పెరిగింది. ఇలాంటి అంశాలనే అవకాశంగా మలచుకున్న కొన్ని స్టార్టప్‌ సంస్థలు.. ఆన్‌లైన్‌ విధానంలో మాంసం విక్రయాలు, డెలివరీలు మొదలుపెట్టాయి. వినియోగదారుల మనసెరిగి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Fire Accident: ఐసీయూలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు కరోనా రోగుల మృతి

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 11.30 గంటల సమయంలో కరోనా వార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆ వార్డులో 17 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

HYD: గచ్చిబౌలి గోపన్‌పల్లిలో కట్టడాల కూల్చివేత.. ఉద్రిక్తత

10. T20 World Cup: రోహిత్‌, రాహుల్‌ ఇలా కొట్టడం ఇంతకుముందు చూడలేదు!

మ్‌ఇండియా ప్రపంచకప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాక్‌, న్యూజిలాండ్‌ జట్లతో ఓటమిపాలైన కోహ్లీసేన తర్వాత అఫ్గాన్‌, స్కాట్లాండ్‌లపై విజయం సాధించింది. దీంతో సంక్లిష్టమైన సెమీస్‌ ఆవకాశాలను మెరుగుపర్చుకుంది. ఆదివారం అఫ్గానిస్థాన్‌ మాయ చేసి న్యూజిలాండ్‌ను ఓడిస్తే భారత్‌ పొట్టి ప్రపంచకప్‌లో మళ్లీ తన ప్రయాణాన్ని ముందుకు సాగించే వీలుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని