Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Oct 2021 21:08 IST

1. Puneeth rajkumar: పునీత్‌.. ఆ కల నెరవేరకుండానే కన్నుమూశారు

తన చిరకాల కల నెరవేరకుండానే కన్నడ స్టార్‌ హీరో, పవర్‌స్టార్‌ పునీత్‌కుమార్‌ కన్నుమూశారని ప్రముఖ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ అన్నారు. పునీత్‌ మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. నటుడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పునీత్‌ వల్లే తన కెరీర్‌ మొదలైందని అన్నారు. ‘‘పునీత్‌ నటించిన ‘వీర కన్నడిగా’ చిత్రంతోనే నేను దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాను. అనంతరం నా రెండో ప్రాజెక్ట్‌ ‘అజయ్‌’ కూడా ఆయనతోనే చేశాను. నన్ను తన ఇంటిసభ్యుడిలా చూసుకునేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Puneeth Rajkumar: అగ్రనటులందరినీ కాదని.. పునీత్ ఆయన కోసం ఎదురుచూశారట..!

2. Modi: వాటికన్‌ సిటీలో మోదీ.. పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన ప్రధాని

ఇటలీ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వాటికన్‌ సిటీ చేరుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఉన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతగురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ను మోదీ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమైన వీరు.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్‌ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Mark Zuckerberg: ఇంతకీ జుకర్‌బర్గ్‌ సాస్‌ బాటిల్‌ అక్కడెందుకు ఉంచారు?

ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ మాతృసంస్థ పేరును ఇక ‘మెటా’గా పిలవనున్నారు. ఈ మేరకు పేరు మార్పు సంగతిని ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ గురువారం వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ఈ వీడియోను ఆయన ఇంట్లో తన లివింగ్‌ రూంలో షూట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, సామాజిక మాధ్యమాల డేగ కన్ను గురించి తెలిసిందే. వీడియోలో కనిపించిన దృశ్యాలను క్షుణ్నంగా పరిశీలించి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఆ దేశ జీడీపీ కంటే ఎక్కువట

4. Mamata Banerjee: కాంగ్రెస్‌ వల్లే మోదీ మరింత పవర్‌ఫుల్‌.. దీదీ విమర్శలు

రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని మోదీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించట్లేదని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్ అప్‌డేట్స్‌ 👆కోసం క్లిక్‌ చేయండి

5. Corona Virus: 84శాతం మందికి ఫుల్‌ వ్యాక్సిన్‌.. అయినా కరోనా పెరుగుతోంది!

రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నాం.. ఇక నిశ్చితగా ఉండొచ్చు అనే భరోసా వద్దు. అందుకు సింగపూరే సాక్ష్యం. ఈ బుల్లి దేశంలోని మొత్తం జనాభాలో 84శాతం మంది రెండు విడతల వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అందులో 14శాతం మంది బూస్టర్‌ టీకాలు కూడా వేయించుకున్నారు. మిగిలిన వాళ్లలో ఒక డోసు టీకా వేయించుకుంది 85శాతం. అయినా అక్కడ రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Coronavirus Origin: కరోనా మూలాలు ఎప్పటికీ కనిపెట్టలేమా?

6. Chandrababu: దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి: చంద్రబాబు

చిత్తూరు జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమను హస్తగతం చేసుకొని వైకాపా నాయకులు దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే వైకాపా నాయకుల ఆటకట్టిస్తామన్నారు. పన్నులతో దోచుకుంటున్న ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. తొలుత లక్ష్మీపురంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన అక్కడి నుంచి వరదరాజస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Puneeth rajkumar: ఎన్టీఆర్‌ని చూడగానే కన్నీరు పెట్టుకున్న శివరాజ్‌కుమార్‌

తన ప్రాణ స్నేహితుడు, కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు తారక్‌ నివాళులర్పించారు. పునీత్‌ మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. కంఠీరవ మైదానంలో శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్‌ పార్థివదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తారక్‌ని చూసిన పునీత్‌ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Puneeth Rajkumar: ‘అప్పూ సర్‌ ఈ వీడియోలో వచ్చినట్లు మళ్లీ రండి ప్లీజ్‌’

8.  China: ‘చైనాలో కలిసిపోవడం తప్ప.. తైవాన్‌కు భవిష్యత్తు లేదు’
చైనా, తైవాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే.. చైనాలో భాగం కావడం మినహా తైవాన్‌కు వేరే భవిష్యత్తు లేదని చైనా స్టేట్ కౌన్సిలర్, విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ తాజాగా స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దేశానికి అంతర్జాతీయంగా చట్టపరమైన గుర్తింపు లేదని పేర్కొన్నారు. ఐరాసలో తైవాన్‌కు భాగస్వామ్యం విషయమై అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల మద్దతు తెలిపిన నేపథ్యంలో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
9.  T20 World Cup: భారత్‌ Vs కివీస్‌.. సమ ఉజ్జీల మధ్య పోరులో గెలుపెవరిదో!

తమ తొలి మ్యాచుల్లో ఓటమి. ఒకే ప్రత్యర్థి చేతిలో భంగపాటు. తమ తదుపరి మ్యాచ్‌లో ఆ రెండు జట్లే తలపడబోతున్నాయి... ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ జట్లేవో..! అవే భారత్, న్యూజిలాండ్‌. ఇరు జట్లను ఓడించిన ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్‌. అయితే, పాక్‌ చేతిలో భారత్‌ ఘోర పరాభవం చెందగా.. కివీస్‌ మాత్రం కాస్త పోరాడి ఓడింది. ఫలితం మాత్రం సేమ్‌ టు సేమ్. జట్లపరంగా భారత్‌, కివీస్‌ ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోవు. ఓపెనర్ల నుంచి బౌలర్ల వరకు రెండు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

లైవ్ అప్‌డేట్స్‌ 👆కోసం క్లిక్‌ చేయండి

10. WhatsAPP: నవంబరు 1 నుంచి ఈ మొబైల్స్‌లో వాట్సాప్‌ బంద్!

పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ తన సేవలు నిలిపివేస్తోంది. నవంబరు 1 నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్‌ 9, కాయ్‌ 2.5.1 వెర్షన్‌ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్‌, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి. దీనికి సంబంధించి ఫోన్ మోడల్స్‌లో జాబితాను వాట్సాప్ ఇప్పటికే విడుదలచేసింది. మరో మూడు రోజుల్లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతున్న ఆ ఫోన్‌ మోడల్స్‌ ఏంటో చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని