Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 19 Mar 2024 09:17 IST

1. ఇదేం సామాజిక న్యాయం జగన్‌?

వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్‌ మార్క్‌ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

 2. రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. రూ.50 వేలకు పైగా నగదును వెంట తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, లేకుంటే అధికారులు స్వాధీనం చేసుకుంటారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి

తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘ఇదేమి ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్నారు. కార్పొరేటర్‌ చూడండి.. కొట్లాటకు వస్తున్నాడు. కొట్టే హక్కు ఎవరిచ్చారండీ వీరికి. మీకు రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ సామాన్యులు ఆ వీడియోలో వాపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇదో కొత్త తరహా మోసం..! ఏటీఎం వద్ద చోరుల మాయ 

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త తరహాలో ఏటీఎం కేంద్రం నుంచి నగదు చోరీ చేసిన ఘటన మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలోని పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురం కోరమాండల్‌ గేటు పక్కన ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

5. రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!

తెలంగాణలో నూతన రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి జిల్లాలోనూ మొదటి 10 వేల నంబర్ల వరకు జిల్లా కోడ్‌ తర్వాత ‘ఏబీ’ లాంటి సిరీస్‌ లేకుండా నేరుగా నంబర్లు ఉంటాయి. శుక్ర, శని, సోమవారాల్లో 33 జిల్లాల పరిధిలో ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై వేటు?

నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యం అంశంలో పల్నాడు ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిపై వేటు వేయనున్నట్లు తెలిసింది. ప్రధాని పాల్గొనే సభ అని తెలిసినా పోలీసు అధికారులు భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకోలేదు. బందోబస్తు విధుల్లో ఉన్న కొద్ది మంది పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు

కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ కంపెనీ డెల్‌ లేఖ పంపినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో అనుమతించిన ఇంటి నుంచి పని హైబ్రిడ్‌ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే (ఆర్‌టీఓ) విధానాన్ని ఆ సంస్థ అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ హెచ్చరిక జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బుద్వేల్‌, మోకిల లేఅవుట్లకు మోక్షం

ఎట్టకేలకు కీలమైన బుద్వేల్‌, మోకిల హెచ్‌ఎండీఏ లేఅవుట్ల అభివృద్ధి పనులకు మోక్షం లభించింది. ఈ రెండు లేఅవుట్లలో ప్లాట్లను వేలం ద్వారా గత ప్రభుత్వం విక్రయించింది. వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించినప్పటికీ వసతుల కల్పనలో హెచ్‌ఎండీఏ తాత్సారం చేసింది. వాస్తవానికి 18 నెలల్లో లేఅవుట్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే గడువు ముగియడంతో కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘స్టేట్‌మెంట్‌’ దాఖలు విషయంలో అనిశ్చితి!

తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్‌-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఇప్పటికే న్యాయవాదులు, నిపుణులతో ఏర్పాట్లు చేసుకుంటోంది. డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకోవాల్సి ఉండగా లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎంతమేరకు దృష్టి సారిస్తుందన్నది వేచి చూడాలి. మరోవైపు ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. దీంతో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌ విషయంలో రెండు రాష్ట్రాలూ గడువు లోపు దాఖలు చేయడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10.  అధిక కొలెస్ట్రాల్‌ను కాలేయం తింటుంది!

శరీరం తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. కాలేయంలోని రోగనిరోధక కణాలు అధిక కొలెస్ట్రాల్‌ మోతాదులకు స్పందించటమే కాకుండా.. ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్‌ను తినేస్తున్నట్టూ స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ అధ్యయనంలో బయట పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని