బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి

తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 19 Mar 2024 05:13 IST

 సామాజిక మాధ్యమాల్లో ఓ కార్పొరేటర్‌ వీడియో వైరల్‌

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘ఇదేమి ప్రభుత్వం ప్రజలను హింసిస్తున్నారు. కార్పొరేటర్‌ చూడండి.. కొట్లాటకు వస్తున్నాడు. కొట్టే హక్కు ఎవరిచ్చారండీ వీరికి. మీకు రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ సామాన్యులు ఆ వీడియోలో వాపోయారు. నగరపాలక సంస్థ పరిధిలోని 45వ డివిజన్‌ శివజ్యోతినగర్‌లో.. ఓ ఇంటి ఆవరణలో బోరు వేస్తుండగా కార్పొరేటర్‌ అనీష్‌ అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే అనుమతిస్తామని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఉపమేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి అండతో ఆయన ఆగడాలకు అడ్డులేకుండా పోతుందని డివిజన్‌ పరిధిలోని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిల్ని ఓ బృందంగా ఏర్పాటు చేసుకుని దౌర్జన్యాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని