icon icon icon
icon icon icon

Chandrababu: ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా?: చంద్రబాబు

జగన్‌ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయి

Published : 02 May 2024 18:16 IST

రాయచోటి: జగన్‌ రాజకీయాల్లో ఉంటే ప్రజల బతుకులు దిగజారుతాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పట్టాదారు పాసు పుస్తకంపై జగన్‌ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్‌ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తీసుకువస్తున్నారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.  వైకాపాకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి.

గెలుపు మనదే.. అభివృద్ధికి పునాదులు వేసుకుందాం. వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో 99శాతం హామీలు అమలు కాలేదు. కూటమి మ్యానిఫెస్టోలో దమ్ముంది. అన్ని వర్గాలవారికి న్యాయం చేశాం. సంపద సృష్టించి.. ప్రజలకు పంచడమే మా విధానం. అధికారంలోకి వచ్చిన వారంలో జగన్‌ సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు. పీఆర్‌సీ ఇస్తామన్నారు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img