Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 18 May 2022 09:19 IST

1. సచివాలయంలో ‘ప్రైవేటీకరణ?’

రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కార్యాలయం సచివాలయం. అక్కడ నిబంధనల ప్రకారమే ప్రతి దస్త్రం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. విభాగాధిపతుల నుంచి వచ్చే ప్రతి అంశాన్నీ అక్కడ వివిధ స్థాయిల్లో క్షుణ్ణంగా పరిశీలించి అభ్యంతరాలను పేర్కొంటూ దానిని కార్యదర్శి స్థాయికి పంపిస్తారు. అక్కడ నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయా అవసరాలను బట్టి పంపి నిర్ణయాలు తీసుకుంటుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వీధివీధినా ప్రశ్నల వర్షం

2. మెక్సికో నుంచి అమెరికాకు భారీ సొరంగం!

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచవ్యాప్తంగా దుండగులు భారీ సొరంగాలను ఏర్పాటు చేస్తున్నారు. మెక్సికోలోని టిజువానా నుంచి అమెరికాలోని శాన్‌ డియాగో ప్రాంతంలోని ఓ గిడ్డంగి వరకూ విస్తరించిన భారీ సొరంగం ఒకటి తాజాగా వెలుగు చూసింది. భూగర్భంలో ఆరు అంతస్తులంత లోతున, 4 అడుగుల వెడల్పు, 532 మీటర్ల పొడవున దీన్ని నిర్మించారు. ఇందులో పట్టాలు, వెంటిలేషన్‌ వ్యవస్థలతో పాటు విద్యుత్తు సరఫరా, పటిష్టమైన గోడలు ఉండటంతో అధికారులు విస్తుపోయారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు

ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది చదివిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు కరోనా కారణంగా మార్చిలో పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులందరికీ ఉత్తీర్ణత మార్కులు ఇచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పెళ్లి సంబంధం ఇష్టం లేక.. యువ ఇంజినీరు ఆత్మహత్య

తన మృతికి తానే కారణమని లేఖ రాసి ఓ యువ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. బాలాపూర్‌ మండలం గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్న కొత్తగొల్ల కొండయ్య వ్యవసాయదారు. ఈయన కుమారుడు శివకృష్ణ(27) నారాయణఖేడ్‌లో మిషన్‌ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నాడు. శివకృష్ణకు ఓ యువతితో ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 13న అతను గుర్రంగూడలోని సొంతింటికి వచ్చాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 87% మంది సంపాదన నెలకు రూ.10 వేలలోపే..

రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులు చాలీచాలని సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. రోజువారీ వ్యవసాయ కూలీలుగా, ఇంటిపనివారుగా, వీధి వ్యాపారులుగా, నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తున్నవారి ఆదాయం పెరగడం లేదు. కొవిడ్‌ నేపథ్యంలో అసంఘటిత కార్మికులకు ఉపాధి కరవైంది. కుటుంబాలు కుదేలయ్యాయి. ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికుల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలో దాదాపు 87 శాతం మంది నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదించడం లేదని వెల్లడైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొండచిలువ గుడ్ల కోసం రహదారి పనులు బంద్‌

6. టెలిఫోన్‌ తీగ ద్వారా ‘11 కేవీ విద్యుత్తు’ సరఫరానా?

 టెలిఫోన్‌ తీగ ద్వారా 11కేవీ విద్యుత్తు సరఫరా కావడం, అంతటి హైఓల్టేజీ వద్ద కూడా ఆ వైరు కరగకపోవడమన్నది ‘పూర్తి అసంబద్ధం’గా అనిపిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యారంటూ.. ఇద్దరు వ్యక్తులకు శిక్ష విధిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం పక్కన పెట్టింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమ్మ కాని అమ్మ.. ఆకలి తీర్చేనమ్మ!

సదాశివపేట-జహీరాబాద్‌ రహదారిలోని ఆత్మకూరు చౌరస్తా... మంగళవారం మిట్టమధ్యాహ్నం.. మండుటెండ.. ఎనిమిదేళ్ల బాలిక సురేఖ చంకలో నెలల పసికందును ఎత్తుకొని దారిన వచ్చిపోయే వారిని బతిమాలుతోంది. మా చెల్లెలు ఆకలితో ఏడుస్తోంది.. పాలు కావాలి.. కొంచెం సాయం చేయండయ్యా.. అంటూ వేడుకుంటోంది. ఎందుకమ్మా.. ఇలా చేస్తున్నావని అడగ్గా మద్యానికి బానిసైన తల్లిదండ్రుల గురించి చెప్పుకొచ్చింది. తాము సదాశివపేటలో చెరువు పక్క గుడిసెల్లో ఉంటామంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నా గొంతు పిసికి, రవికె చించేశారు

గత ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు, పేదలకు అమలు చేసిన వివిధ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేయడంపై విమర్శలు చేసినందుకు, వాస్తవాలు చెప్పినందుకు స్థానిక వైకాపా నాయకులు దాడి చేసి తనను కొట్టారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ కర్లపూడి వెంకాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని ఎందుకు విమర్శించావంటూ సోమవారం రాత్రి తనను దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి పాల్పడ్డారని..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కొత్త గూగులమ్మ

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్, వినూత్న హార్డ్‌వేర్‌.. కీలక సర్వీసులు, యాప్స్‌కు సంబంధించిన కొత్త ఫీచర్లు! గూగుల్‌ ఏటా నిర్వహించే డెవలపర్‌ ఐ/ఓ కాన్ఫరెన్స్‌ అనగానే టెక్‌ ప్రియులు ఎదురుచూసే అంశాలివి. ఆశించినట్టుగానే ఈ సంవత్సరం కూడా గూగుల్‌ కొంగొత్త ఆవిష్కరణలను ప్రకటించింది.  పైగా ఇంకాస్త ఎక్కువ హార్డ్‌వేర్ల గురించీ ప్రస్తావించింది. మరి ఐ/ఓ 2022 విశేషాల మీద ఓ కన్నేద్దామా!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తర్వాతేంటి?

10. Hyderabad: హైదరాబాద్‌.. ఇంకా ఉంది

లక్ష్యం 194. ముంబయి 17 ఓవర్లకు చేసిన స్కోరు 149/5. విజయానికి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాలి. మామూలుగా చూస్తే ఇదంత తేలిక కాదు. కానీ టిమ్‌ డేవిడ్‌ దాన్ని తేలిగ్గా మార్చేశాడు. 18వ ఓవర్లో అయిదు బంతుల్లో నాలుగుసార్లు బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. 13 బంతుల్లో 19 పరుగులతో ఒక్కసారిగా సమీకరణం సులువైపోయింది. ముంబయి విజయం లాంఛనమే అనుకున్నారంతా. కానీ తర్వాతి ఓవర్లో స్ట్రైక్‌ కోసమని.. చివరి బంతికి లేని పరుగుకు ప్రయత్నించి డేవిడ్‌ రనౌటైపోయాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని