Top 10 News @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Apr 2021 21:55 IST

1. night curfew: ఏపీలో వీటికే అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి కర్ఫ్యూకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: Vijayawada,Ongoleలో దయనీయ పరిస్థితి

2. ఫీల్డ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయండి: కేంద్రం

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ మే 1 నుంచి కరోనా టీకాలు ఇచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ రీసెర్చ్‌ సంస్థల సాయంతో వీలైనన్ని ఫీల్డ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో 11,698 కేసులు.. 37 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు నిర్ధారణ కాగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,20,926 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున; అనంతపురం, చిత్తూరులో నలుగురేసి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ముగ్గురు చొప్పున; గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Bharat Biotech, Serumకు ఏపీ సర్కార్‌ లేఖ

4. ఎక్కువ ఛార్జ్‌ చేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

నగరంలో అంబులెన్సుల నిర్వాహకులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌  హెచ్చరించారు. హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఎనిమిది అంబులెన్సులను సీపీ సజ్జనార్‌ ఇవాళ ప్రారంభించారు. సోమవారం నుంచి మరో నాలుగు అంబులెన్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐటీ సంస్థల సహకారంతో అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టెస్టులు చేయించుకొమ్మంటే ఖాళీ ఫ్లైట్‌తో వెనక్కి

ఇతర ప్రదేశాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారిని ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో కరోనా పరీక్షలు చేయించుకొమ్మంటే పారిపోయిన ఘటనలు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తాజాగా దిల్లీ విమానాశ్రయంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అమెరికా నుంచి భారత్‌కు విమానం తీసుకొచ్చిన సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉండగా.. అందుకు నిరాకరించిన ఆ సిబ్బంది ఖాళీ విమానంతో వెనక్కి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురి మృతి!

6. Vaccination: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్‌ను తరిమికొట్టే బృహత్తర ప్రక్రియ వ్యాక్సిన్‌ పంపిణీని కేంద్రం మరింత వేగవంతం చేసింది. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు అందించే కార్యక్రమం మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ పంపిణీని సమర్థంగా అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆనాడు ప్రజ్ఞాని రిస్క్‌లో పెట్టిన విష్ణు

హీరోయిన్‌ ప్రజ్ఞాజైశ్వాల్‌ని రిస్క్‌లో పెట్టడం తనని ఎంతగానో బాధపెట్టిందని నటుడు మంచు విష్ణు అన్నారు. వీళ్లిద్దరూ కలిసి జంటగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ షూట్‌కు సంబంధించిన ఓ యాక్సిడెంట్‌ వీడియోని తాజాగా విష్ణు షేర్‌ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణుకి పెద్ద ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలోనే ఆయనకు బాగా గాయాలయ్యాయి. తాజాగా ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ షూట్‌ వీడియోని విష్ణు  షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పిల్లాడిలా నాని.. చిరు విష్.. నమ్రత ఛాలెంజ్‌ 

8. మహిళలూ..  అది ఫేక్‌న్యూస్‌! 

మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ఓ ఫేక్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. టీకా వేయించుకొనే ముందు మహిళలు తమ పీరియడ్స్‌ సమయాన్ని చెక్‌ చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. మహిళలు పీరియడ్స్‌కు 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత టీకా తీసుకోవద్దని, ఆ సమయంలో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల టీకా తీసుకుంటే ప్రమాదమంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Ts Corona: అదనంగా 12వేల పడకలు

రానున్న రోజుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 12వేల అదనపు పడకలను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇందు కోసం రూ.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. కొవిడ్ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Oxygen: భారత్‌కు 24 క్రయోజెనిక్‌ కంటైనర్లు 

10. మిథాలి రాజ్‌ రిటైర్మెంట్‌పై నిర్ణయం..

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. ‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం (వర్చువల్‌ పద్ధతి)లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నానని, 2022లో న్యూజిలాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని