ఆనాడు ప్రగ్యాను రిస్క్‌లో పెట్టానన్న విష్ణు - vishnu manchu recalls how he pragya could have met with a dangerous accident
close
Updated : 24/04/2021 21:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆనాడు ప్రగ్యాను రిస్క్‌లో పెట్టానన్న విష్ణు

బైక్‌ యాక్సిడెంట్‌ వీడియో షేర్‌ చేసిన నటుడు

హైదరాబాద్‌: హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ని రిస్క్‌లో పెట్టడం తనని ఎంతగానో బాధపెట్టిందని నటుడు మంచు విష్ణు అన్నారు. వీళ్లిద్దరూ కలిసి జంటగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ షూట్‌కు సంబంధించిన ఓ యాక్సిడెంట్‌ వీడియోని తాజాగా విష్ణు షేర్‌ చేశారు. ఈ సినిమాలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణుకి పెద్ద ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలోనే ఆయనకు బాగా గాయాలయ్యాయి. తాజాగా ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ షూట్‌ వీడియోని విష్ణు  షేర్‌ చేశారు.

‘ఈ ప్రమాదాన్ని నేను తరచూ గుర్తు చేసుకుంటాను. ప్రమాదం జరిగే ఛాన్స్‌ ఉందని షూట్‌కు ముందే దర్శకుడు, ఫైట్‌ మాస్టర్‌కు చెప్పాను. వాళ్లెవరూ నా మాట వినిపించుకోలేదు. నాకెంతో కోపం వచ్చింది. ఆ సమయంలో నాతోపాటు ప్రగ్యాని సైతం రిస్క్‌లో పెట్టినందుకు నాకెంతో బాధగా ఉంది. అదృష్టం కొద్ది తనకి ఏమీ కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం వల్ల నా తలకు కూడా పెద్దగా గాయాలవలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో నా భార్య విరానికా గర్భవతి. నా వల్ల తను ఎంతో భయపడింది. ఈ విషయమై ఇప్పటికీ నేను తనకి క్షమాపణలు చెబుతూనే ఉన్నాను. ఈ ప్రమాదం వల్ల నాకు బంధాలు, అనుబంధాల గురించి ఎంతోగానో తెలిసివచ్చింది’ అని విష్ణు పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని