Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Feb 2024 21:09 IST

1. తొలి జాబితాలో చోటు దక్కని నేతలకు చంద్రబాబు భరోసా

తెలుగుదేశం (TDP) ప్రకటించిన తొలి జాబితాలో చోటు దక్కని ఆలపాటి, బొడ్డు వెంకటరమణ, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పీలా గోవింద్‌తో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) విడివిడిగా మాట్లాడారు. పొత్తులో భాగంగా తెనాలి సీటు సర్దుబాటును అర్థం చేసుకోవాలని మాజీమంత్రి ఆలపాటి రాజాకు సూచించారు. రాజకీయ భవిష్యత్‌కు తగిన ప్రత్యామ్నాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లారీని ఢీ కొన్న కారు.. ఐదుగురి దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సాగర తీరంలో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’.. విశాఖలో సరికొత్త పర్యటక ఆకర్షణ

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటక కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖ నగరంలో మరో సరికొత్త ఆకర్షణ చేరింది. సాగర తీరంలో అలలపై తేలియాడేలా ఏర్పాటు చేసిన ‘ఫ్లోటింగ్ బ్రిడ్జి’ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో నగరంలో పర్యటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

విచారణకు సోమవారం హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. 41ఏ నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. ‘‘సీబీఐకి సమాచారం కావాలంటే వర్చువల్‌ పద్ధతిలో హాజరవుతా. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరుకాలేను. 41ఏ నోటీసులు ఇవ్వడం సబబు కాదు’’ అని లేఖలో పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వచ్చేవారం దలాల్‌ స్ట్రీట్‌ బిజీ బిజీ.. 6 ఐపీఓలు.. 5 లిస్టింగ్‌లు

వచ్చేవారం ఆరు కంపెనీలు ఐపీఓకి (IPO) రానున్నాయి. రూ.3,300 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో మూడు మెయిర్‌బోర్డ్‌ విభాగంలో కాగా.. మరో మూడు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో వస్తున్నాయి. మరో ఐదు కంపెనీల షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. మొత్తంగా వచ్చే వారం దలాల్‌ స్ట్రీట్‌లో సందడి వాతావరణం నెలకొననుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రజలు మోదీనే ప్రధానిగా కోరుకుంటున్నారు: అజిత్‌ పవార్‌

దేశంలోని మెజారిటీ ప్రజలు నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) ఆదివారం అన్నారు. మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రతి ఒక్కరూ ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. బారామతి(Baramati)లోని రైతుల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మంగళగిరి సహా ఐదు ఎయిమ్స్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌), కల్యాణి (పశ్చిమబెంగాల్‌) నగరాల్లో ఎయిమ్స్‌ ఆస్పత్రులను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్-జపాన్ సేనల ‘ధర్మ గార్డియన్‌’ విన్యాసాలు షురూ

భారత్‌ (India), జపాన్‌ (Japan) మధ్య రక్షణ సహకారం మరింతగా బలోపేతం దిశగా కీలక ముందడుగు పడింది. ‘ధర్మ గార్డియన్‌’ పేరిట ఇరుదేశాల సైనిక బృందాల సంయుక్త విన్యాసాలు ( joint Air Exercise) ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న మొదలైన ఈ విన్యాసాలు రాజస్థాన్‌లోని మహజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో మార్చి 9 వరకు కొనసాగనున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జోడో యాత్ర.. చేతులు కలిపిన రాహుల్‌ గాంధీ-అఖిలేశ్‌

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒప్పందం కుదిరింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు