- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
కరోనా కాలం: ఈ టిప్స్ పాటించండి
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన వేళ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించి ప్రజలను ఇంటికే పరిమతం అవ్వాలని ఆదేశించాయి. కానీ ఎన్నాళ్లని అలా ఉంచగలవు? అందుకే కరోనా వ్యాప్తి చెందుతున్నా.. అన్‌లాక్ చేస్తూ ప్రజల జీవితాలు సాధారణస్థితికి వచ్చేలా చేస్తున్నాయి. ప్రజలు సైతం పనులు చేసుకునేందుకు బయటకు వచ్చేస్తున్నారు. వ్యాక్సిన్‌పై ఆశలు ఉన్నా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేం. కాబట్టి కరోనా పరిస్థితుల్లోనూ సాధారణంగా జీవించాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన పది టిప్స్ ఏంటో చూద్దాం..!
ఇంట్లో నుంచి బయటకు రండి
ఇంట్లో సరైన వెంటిలేషన్ లేకపోతే గాలి సరఫరా సరిగా ఉండదు. అలాగే సామాజిక దూరం పాటించడం కుదరకపోవచ్చు. అందుకే బయట కన్నా ఇంట్లోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించండి.
సూర్యరశ్మిలో నిలబడండి
ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే ‘డి’ విటమిన్ వస్తుందని చిన్నప్పుడే నేర్చుకున్నాం. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ‘డి’ విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అయితే సూర్యుడి కిరణాలు కరోనా వైరస్ చర్యను స్తంభింపజేస్తుందని ‘ది జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్’ పేర్కొంది. అంటే సూర్యరశ్మిలో నిలబడటం వల్ల రెండు లాభాలున్నాయన్నమాట.
ఏసీని వాడొద్దు
నోటి తుప్పర్ల ద్వారా బయటకు వచ్చే కరోనా వైరస్ గాలిలో కొంత సమయం ఉంటుంది. ఆ గాలిని ఎవరైనా పీల్చుకుంటే వారికి కరోనా సోకే ప్రమాదముంది. ముఖ్యంగా ఏసీ ద్వారా వచ్చే గాలి వేగంగా కదులుతుంది. దీంతో కరోనా వైరస్ ఒకరి నుంచి మరోకరి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఏసీలను ఉపయోగించడం మానుకోండి.
మాస్క్ ధరించండి
కరోనా ప్రబలిన నాటి నుంచి చెబుతున్న విషయమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని మనం కరోనా నుంచి రక్షించుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలి. అలా అని 24/7 పెట్టుకోవద్దు. చుట్టుపక్కల ఎవరూ లేని.. కరోనా సోకే అవకాశం లేని ప్రాంతంలో మాస్కులు తీసేయండి. ఎక్కువ సేపు మాస్క్ ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
కారు విండోస్ తెరిచే ఉంచండి
కారులో ప్రయాణిస్తున్నప్పుడు విండోస్ తెరిచే ఉంచండి. బయటకు వెళ్తున్నామని మాస్క్ పెట్టుకోగానే సరిపోదు. కారు విండోస్ మూసి ఉంచితే గాలి సరఫరా ఉండదు. ఏసీతోనూ ప్రమాదముంది. కాబట్టి కారు విండోస్ తెరిచే ఉంచండి.
వీలైతే కళ్లద్దాలు లేదా ఫేస్‌షీల్డ్ పెట్టుకోండి
కరోనా వైరస్ మన వరకు ఎలా వచ్చినా.. నోరు, ముక్కు, కళ్ల ద్వారానే శరీరంలోకి చేరుతుంది. కాబట్టి చేతులను శుభ్రం చేసుకోకుండా వాటిని తాకేందుకు ప్రయత్నించకండి. మన ప్రమేయం లేకుండా మన చేతులు ఆ అవయవాలను తాకుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించేందుకు కళ్లకు అద్దాలు పెట్టుకోవడం లేదా ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. కచ్చితమైన నిబంధన అయితే కాదు.. కానీ సురక్షితంగా ఉండాలంటే తప్పదు మరి.
విమాన ప్రయాణం కొన్నాళ్లు మానుకోండి
కరోనా వచ్చిన నాటి నుంచి దేశాలన్నీ విమాన సర్వీసులను మూసివేశాయి. ప్రస్తుతం విమాన ప్రయాణాలకు వెసులుబాటు కల్పించారు. దీంతో చాలా మంది విమానమెక్కేస్తున్నారు. పరిచయం లేని వారు ఎవరెవరో పక్కన కూర్చుంటారు. తుమ్మినా, దగ్గినా అనుమానించాల్సి ఉంటుంది. ఒకవేళ వారికి కరోనా సోకి ఉంటే మీకు వ్యాపించే అవకాశం అధికంగా ఉంటుంది. అలాంటి తలనొప్పులు ఏవి ఉండొద్దనుకుంటే కొన్నాళ్లపాటు విమాన ప్రయాణాలు చేయకండి.
ఆహారం పంచుకోవద్దు
ఇప్పుడు ఉద్యోగులందరూ ఆఫీసులకు వెళ్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే లంచ్‌టైంలో అందరూ కలిసి తింటూ వంటకాలను పంచుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేయకండి. మీ ఆహారం ఇతరులతో పంచుకోకుండా ఉండటమే ఉత్తమం. చాలా మందిలో కరోనా వైరస్ ఉన్నా లక్షణాలు తెలియట్లేదు. మీ సహోద్యోగుల్లో ఎవరికైనా ఉన్నా.. మీకే ఉన్నా ఆహారం పంచుకునే క్రమంలో వైరస్ వ్యాప్తి చెందొచ్చు.
చేతుల్ని శుభ్రంగా కడగాలి
చేతులను శుభ్రంగా కడగడం పరిశుభ్రతలో తొలి నియమం. ఇది వరకు చేతులు కడగకపోయినా పర్వాలేదులే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది ముట్టుకున్నా.. పట్టుకున్నా ఆ తర్వాత చేతుల్ని శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాల్సిందే. లేకపోతే చేతులపై ఉండే కరోనా వైరస్ మన ముక్కు, నోరు, కళ్ల ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదముంది.
భౌతిక దూరం కొనసాగించండి
ఒకరి నుంచి మరొకరి కరోనా సోకకుండా ఉండాలంటే కనీసం ఆరు అడుగులు భౌతిక దూరం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో నుంచి వైద్య నిపుణుల వరకు అందరూ చెప్పారు. కరోనాను కట్టడి చేయాలంటే ఇంత కంటే ఇప్పట్లో మరో మార్గం కూడా లేదు. వ్యాక్సిన్.. ఔషధాలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే వరకు సామాజిక దూరాన్ని పాటిస్తుండటమే మేలు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
India News
Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
Movies News
NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!