TS News: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు...

Updated : 27 Nov 2021 16:34 IST

హైదరాబాద్‌: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. ఇదే అంశంపై ఇటీవల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబయి, దిల్లీలో దిగి భాగ్యనగరానికి వచ్చే వారిని ట్రేసింగ్‌, టెస్టింగ్‌ సహా పలు అంశాలపై చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని