బయోమెట్రిక్‌ అమలు చేయడం వల్ల ఇబ్బందేంటి?: టీఎస్‌పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్సీ వేసిన అప్పీల్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

Updated : 26 Sep 2023 13:53 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరిగింది. టీఎస్‌పీఎస్సీ వేసిన అప్పీల్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

‘‘బయోమెట్రిక్‌ అమలు చేయడం వల్ల ఇబ్బందేమిటి?గతంలో అలా అమలు చేసిన పరీక్షల వివరాలను తెలపండి. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు బయోమెట్రిక్‌ ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌ను మీరే అమలు చేయకపోతే ఎలా? ఒకసారి పరీక్ష రద్దయ్యాక మరింత జాగ్రత్తగా ఉండాలి కదా? నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉంది. అభ్యర్థుల భవిష్యత్తు, టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని