Viveka Murder Case: శివశంకర్‌ రెడ్డి బెయిల్‌ దరఖాస్తుకు ఓకే.. కానీ: సుప్రీం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డికి బెయిల్ దరఖాస్తుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.

Published : 04 Aug 2023 15:01 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్‌ రెడ్డి బెయిల్ దరఖాస్తుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. కేసులో ట్రయల్‌ ప్రారంభం కాకపోతే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 29న సుప్రీం ఉత్తర్వులపై శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ క్లారిటీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాగ్‌, జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.

బెయిల్‌ అప్లికేషన్‌పై మెరిట్‌ ఆధారంగానే విచారణ చేపట్టాలని ఆదేశించింది. తమ వ్యాఖ్యలు గానీ, ఇతరత్రా ఏ అంశాలు విచారణలో ప్రభావం చూపకూడదని ధర్మాసనం పేర్కొంది. ‘‘బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని సంబంధిత కోర్టే నిర్ణయిస్తుంది. బెయిల్‌కు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తాము నిర్ణయించలేం. కేసులో భాగస్వాములందరి వాదనల తర్వాతే బెయిల్‌పై ఆదేశాలు ఇవ్వాలి’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని