Navy Marathon: 18వేల మందితో విశాఖ సాగర తీరంలో ‘నేవీ మారథాన్’

విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫుల్‌ మారథాన్‌ (42కె), ఆఫ్‌ మారథాన్‌ (21కె), 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. 

Updated : 13 Nov 2022 13:57 IST

పెదవాల్తేరు: విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫుల్‌ మారథాన్‌ (42కె), ఆఫ్‌ మారథాన్‌ (21కె), 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. 

తొలుత ఆర్కేబీచ్‌ సమీపంలోని కాళీమాత ఆలయ ఆవరణలో నేవీ అధికారులు, సినీనటులు మిలింద్‌ సోమన్‌, అడివి శేష్‌ జెండా ఊపి ఈ మారథాన్‌లను ప్రారంభించారు. ఫుల్‌ మారథాన్‌ ఐఎన్‌ఎస్‌ కళింగ వద్ద ముగిసింది. నేవీ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత సాగర తీరానికి తరలిరావడంతో ఫుల్‌ జోష్‌ నెలకొంది. ప్రతిభ కనబరిచిన వారికి నిర్వాహకులు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు