Andhra news: డిసెంబరు నాటికి 2.62 లక్షల ఇళ్లు: ఆదిమూలపు సురేష్‌

రాబోయే డిసెంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 2,62,216 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Published : 20 Apr 2022 22:51 IST

విజయవాడ: రాబోయే డిసెంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 2,62,216 ఇళ్లను లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. ఈ జూన్‌ 22 నాటికి కనీసం 1.34 లక్షల నివాస గృహాలను పంపిణీ చేస్తామన్నారు. ఆపై ప్రతి నెల కనీసం 39 వేల నుంచి 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. నివాస సముదాయాల దగ్గర మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించి, కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకున్నామని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్లను వచ్చే నెలలో అర్హులైన వారికి అందిస్తామని ప్రకటించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని