Andhra News: ఏపీలో మరో 3 రోజులు వానగండం: అమరావతి వాతావరణ కేంద్రం

మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో...

Published : 13 Jul 2022 18:07 IST

అమరావతి: మరో 3 రోజులు రాష్ట్రంలోని అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో రెండు, మూడు చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది.  ఎల్లుండి కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

నిన్న వాయవ్య బంగాళాఖాతం.. పరిసర ప్రాంతాల్లో గుర్తించిన అల్పపీడన ప్రాంతం ఇవాళ దక్షిణ కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాలకు విస్తరించిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వంపు తిరిగిందని తెలిపింది. రుతుపవన ద్రోణీ ప్రస్తుతం బికనీర్, కోటా, రైసెన్‌, మలంజ్‌ఖండ్‌, రాయ్‌పూర్‌ కేంద్రంగా వెళ్తుందని వివరించింది. దక్షిణ కోస్తా, ఒడిశా పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం సముద్ర మట్టానికి 1.5కి.మీ వరకు ఉందని, అది ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిందని తెలిపింది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంపు తిరిగి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు