Ramalakshmi Arudra: ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి కన్నుమూత

ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

Published : 03 Mar 2023 17:13 IST

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 1930 డిసెంబరు 31న కోటనందూరులో జన్మించిన ఆమె.. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యం, ప్రాచీనాంధ్ర సాహిత్యం అభ్యసించారు. తెలుగు స్వతంత్రలో ఇంగ్లీషు విభాగానికి ఉపసంపాదకులుగా పనిచేశారు. స్త్రీ సంక్షేమ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. 1954లో కవి, సాహిత్య విమర్శకుడు ఆరుద్రతో రామలక్ష్మికి వివాహమైంది. ఆ తర్వాత ‘రామలక్ష్మి ఆరుద్ర’ కలం పేరుతో రచనలు చేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని