YS Avinash Reddy: ముందస్తు బెయిల్‌ వ్యవహారం.. 2 గంటలకు పైగా అవినాష్‌ న్యాయవాది వాదనలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.

Updated : 26 May 2023 14:56 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. వెకేషన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. లక్ష్మణ్‌ ఎదుట అవినాష్‌ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుమారు 2 గంటలకు పైగా వాదనలు వినిపించారు. 

హత్య చేసినట్టు నేరాంగీకార వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా నిందితుడు దస్తగిరి ముందస్తు బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించలేదని ఉమామహేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరిని సీబీఐ అన్ని విధాలా వెనకేసుకుని వస్తోందన్నారు. హత్య చేసిన వ్యక్తి బయటే తిరుగుతున్నా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత స్పందించడం లేదని చెప్పారు.  వాదనల్లో వేగం పెంచాలని అవినాష్‌ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. అనంతరం భోజన విరామం నేపథ్యంలో విచారణను కాసేపు వాయిదా వేశారు.  విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని