
ఆగస్టు 15 తరవాతే అక్కడ 4జీ సేవలు
మొదట రెండు జిల్లాల్లోనే
దిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో ఈ సడలింపునకు అనుమతి ఉండదని, ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. రెండు నెలల తరవాత ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కట్టబెట్టే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీస్తూ చేసిన చట్టం కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని 4జీ ఇంటర్నెట్ సేవలను నిలివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఈ నిషేధం విధించి సంవత్సరం దాటిపోయింది.
కాగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇంటర్నెట్ మీద ఆంక్షలు కరోనావైరస్ చికిత్స, విద్య, వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం చూపడంలేదన్నారు. మొబైల్ ఫోన్లలో హైస్పీడ్ ఇంటర్నెట్ను పునరుద్ధరించే విధంగా ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాలని శుక్రవారం సుప్రీం కోర్టు జమ్ముకశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితమే కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం జరగడంతో ఆ అంశంపై సూచనలు తీసుకోవడానికి తమకు కొంచెం సమయం కావాలని అక్కడి ప్రభుత్వం సుప్రీంను విజ్ఞప్తి చేసింది. ఇటీవల మనోజ్ సిన్హా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..
-
Politics News
Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
-
Movies News
Amitabh Bachchan: హైదరాబాద్ మెట్రో స్టేషన్లో అమితాబ్.. నెట్టింట ఫొటో చక్కర్లు
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్ ట్వీట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Andhra News: శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం.. ఐదుగురు సజీవదహనం