హాథ్రస్‌ ఘటన.. పోలీసు అధికారులపై వేటు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఆత్యాచార ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది....

Published : 02 Oct 2020 22:11 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ ఆత్యాచార ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో హాథ్రస్‌ జిల్లా ఎస్పీ విక్రాంత్ వీర్‌, డీఎస్పీ రామ్‌ శబ్ద్‌, ఇన్‌స్పెక్టర్‌ దినేష్‌ వర్మ, సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ జగ్‌వీర్‌ సింగ్, హెడ్‌ కానిస్టేబుల్ మహేష్‌ పాల్ ఉన్నారు. ప్రాథమిక నివేదికల ఆధారంగా వీరిపై చర్యలు తీసుకున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ఎస్పీ, డీఎస్పీలకు నార్కో పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో యూపీ సీఎం శుక్రవారం స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఆడవాళ్లకు హాని కలిగించే వారిని అత్యంత కఠినంగా శిక్షిస్తామని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే పోలీసు అధికారులపై చర్యలకు ఉపక్రమించడం గమనార్హం.

ఇవీ చదవండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని