ప్రణబ్‌ అంతిమయాత్ర ప్రారంభం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అంతిమయాత్ర మొదలైంది. దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. ..

Updated : 01 Sep 2020 13:30 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అంతిమయాత్ర మొదలైంది. దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది.అక్కడ సైనిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా సురక్షిత దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.

అంతకుముందు ప్రణబ్‌ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, భాజపా నేత జ్యోతిరాధిత్య సింధియా, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సహా పలు పార్టీలకు చెందిన నాయకులు, ఇతర ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని