Tamil Nadu: లాక్‌డౌన్‌ పొడిగింపు

కొవిడ్‌ కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం మరో వారంపాటు కొనసాగించనుంది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

Updated : 22 May 2021 16:47 IST

కొత్త మార్గదర్శకాల విడుదల

చెన్నై: కొవిడ్‌ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను తమిళనాడు ప్రభుత్వం మరో వారం పాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. తాజాగా విధించిన లాక్‌డౌన్‌ ఆదివారం ముగియనుంది. ఈ నెల 31 వరకు అమలులో ఉండబోయే తాజా లాక్‌డౌన్‌కు సంబంధించి ఎలాంటి సడలింపులూ లేకపోగా.. మరి కొన్ని కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడించింది. 

కొత్త మార్గదర్శకాలు ఇవే...

* ఫార్మసీ, పాల విక్రయ కేంద్రాలు, తాగునీరు, దినపత్రికల పంపిణీకి అనుమతి ఉంటుంది.

* కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను అన్ని జిల్లాల్లోనూ సంచార వాహనాల్లో రాష్ట్ర ప్రభుత్వమే విక్రయిస్తుంది.

* సచివాలయం సహా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అత్యవసర సేవలకు సంబంధించిన శాఖలే  విధుల్లో ఉండాలి.

* అన్ని ప్రైవేటు సంస్థలు సహా, బ్యాంకులు, బీమా, ఐటీ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలి.

* ఈ కామర్స్‌ సంస్థలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయొచ్చు.

* హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార పదార్థాల పార్శిల్‌, ఆన్‌లైన్‌ డెలివరీలు ఇచ్చేందుకు ఉదయం 6 గంటల నుంచి 10, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3, సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు అనుమతి ఉంటుంది.

* పెట్రోలు బంకులు, ఏటీఎమ్‌లు యథాతథంగా పని చేస్తాయి.

* వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండబోదు.

* నిత్యావసర వస్తువులు, అత్యవసర సరకులను రవాణా చేసే వాహనాలకు అనుమతి ఉంటుంది.

* వైద్య సేవలు, అంతిమ సంస్కారాల  కోసం మాత్రమే అంతర్‌ జిల్లా ప్రయాణం చేయొచ్చు. అయితే ఇందుకోసం ముందస్తుగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది.

* జిల్లా లోపల వైద్య సేవల కోసం ప్రయాణించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతులూ అవసరం లేదు.

* నిరంతర ఉత్పత్తి, నిత్యవసర సరకులు ఉత్పత్తి, వైద్య పరికరాలను తయారు చేసే పరిశ్రమలు యథావిధిగా పనులు కొనసాగించొచ్చు.

* శనివారం అన్ని దుకాణాలను రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంచొచ్చు. ఆదివారరం ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరవచ్చు.

* మాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదు.

* ఈ శని, ఆదివారాలు మాత్రం ప్రభుత్వ, ప్రయివేటు బస్సులన్నీ తిరగొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని