కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. అదేస్థాయిలో వైరస్‌ నుంచి కోలుకుంటున్నారు. మరోవైపు కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా పెరుగుతుంది.....

Published : 20 Aug 2020 17:32 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా పెరుగుతోంది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ఆయన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘‘నాలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకొని, ఐసోలేషన్‌లో ఉండండి. అందరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి’’ అని ట్వీట్ చేశారు.

అయితే మంత్రి రెండు రోజుల క్రితం హరియాణా-పంజాబ్ రాష్ట్రాల నీటి పంపకాల విషయమై సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన గుడ్‌గావ్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఈ నెల మొదట్లో హోం మంత్రి అమిత్‌ షా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయుష్ శాఖ మంత్రి శ్రీపద్ నాయక్‌, వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌధురి, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, సహాయ మంత్రి అర్జున్‌ రామ్ మేఘవాల్‌తో పాటు ఆరోగ్య శాక కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌లకు కూడా కరోనా బారిన పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని