Jammu and Kashmir: నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. అమర్‌నాథ్ యాత్ర

Updated : 16 Aug 2022 12:55 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో శ్రీనగర్‌కు తరలించారు. ఈ భద్రతా సిబ్బంది అమర్‌నాథ్ యాత్ర విధులను ముగించుకుని చందన్‌వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం సమయంలో బస్సులో 37 మంది ఇండో-టిబెటెన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉన్నారు. బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడంతో బస్సు రోడ్డు మీద నుంచి నదిలో పడిందని ఐటీబీపీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని