Vaccine: జంతువులకూ కొవిడ్‌ టీకాల పంపిణీ

ప్రపంచవ్యాప్తంగా జంతువులు సైతం కరోనా బారిన పడుతున్న వేళ.. రోగ నిరోధకశక్తి పెంచేందుకు జంతువులకు కూడా టీకా పంపిణీని చేపడుతున్నారు. ఈ మేరకు అమెరికాలోని ఒక్లాండో జంతు ప్రదర్శనశాలలోని....

Published : 04 Jul 2021 23:50 IST

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా జంతువులు సైతం కరోనా బారిన పడుతున్న వేళ.. రోగనిరోధకశక్తి పెంచేందుకు జంతువులకు కూడా టీకా పంపిణీని చేపడుతున్నారు. ఈ మేరకు అమెరికాలోని ఒక్లాండో జంతు ప్రదర్శనశాలలోని కొన్ని జంతువులకు టీకాలు పంపిణీ చేశారు. జోటీస్ అనే ఔషధ తయారీ సంస్థ.. ప్రత్యేకంగా జంతువుల కోసం రూపొందించిన టీకాను పులులు, ఎలుగుబంట్లు, సింహాలకు ఇచ్చినట్లు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. జంతువుల రోగ నిరోధకశక్తి ఆధారంగా టీకాలు ఇస్తున్నట్లు వివరించారు. జోటీస్ సంస్థ ఇప్పటికే అమెరికాలోని 70 జంతు ప్రదర్శనశాలలకు 11 వేల టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని