టీవీ ఛానల్‌పై కొరడా ఝుళిపించిన కేంద్రం..!

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న సమాచారం నేపథ్యంలో ఓ టీవీ ఛానల్‌పై కేంద్రం కొరడా ఝులిపించింది.

Published : 23 Feb 2022 01:31 IST

దిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న సమాచారం నేపథ్యంలో ఓ టీవీ ఛానల్‌పై కేంద్రం కొరడా ఝుళిపించింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఎస్‌ఎఫ్‌జె (Sikhs For Justice)తో సంబంధం ఉన్న ఆ ఛానల్‌కు చెందిన యాప్స్, వెబ్‌సైట్, సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించింది. చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం కింద ఎస్‌ఎఫ్‌జె ఆంక్షలు ఎదుర్కొంటోంది. కాగా, తాజా చర్యలపై మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 

‘సదరు ఛానల్.. ఆన్‌లైన్ వేదికలను వినియోగించి ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి అందిన వివరాల ఆధారంగా ఐటీ చట్టాల్లోని అత్యవసర అధికారాలను ఉపయోగించాం. వాటి కింద ఫిబ్రవరి 18న ఆ ఛానల్ ఆన్‌లైన్ ఖాతాలను  బ్లాక్ చేశాం’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ ఖాతాల్లోని సమాచారం వేర్పాటువాదాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా, దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించేలా ఉందని గుర్తించినట్లు పేర్కొంది. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలను అడ్డుకొనే విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని