Positivity Rate:దిల్లీలో 5 శాతం దిగువకు..  

కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరైపోయిన దేశ రాజధాని నగరానికి మహమ్మారి నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టే కనబడుతోంది. ఏప్రిల్‌ మాసంలో దాదాపు 36శాతంగా ఉన్న.......

Published : 21 May 2021 17:19 IST

దిల్లీ: కరోనా విజృంభణతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని నగరానికి మహమ్మారి నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టే కనబడుతోంది. దిల్లీలో ఏప్రిల్‌ మాసంలో దాదాపు 36శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు తాజాగా 4.7శాతానికి తగ్గడం విశేషం. గడిచిన 24గంటల వ్యవధిలో 3009 కేసులు రాగా.. 252 మరణాలు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 4 తర్వాత పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ నమోదుకావడం ఇదే తొలిసారి. 5శాతం కన్నా తక్కువ ఉంటే సేఫ్‌ జోన్‌లో ఉన్నట్టేనని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంటుంది.

మరోవైపు, లాక్‌డౌన్‌ విధించడం వల్లే సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినట్టు వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. దిల్లీలో వరుసగా మూడో రోజు 4వేల కన్నా తక్కువ కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య 35,683కి తగ్గింది. అక్కడ ఇప్పటి వరకు 14,12,959 మంది కోలుకోగా.. 22831 మంది మృతి చెందారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.85 శాతం కాగా.. మరణాల రేటు 1.62శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని