Drone mela: డ్రోన్‌ టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మారుస్తాం!

డ్రోన్‌ టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు తమ కృషిని వేగవంతం చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.....

Published : 10 Dec 2021 23:23 IST

గ్వాలియర్‌: డ్రోన్‌ టెక్నాలజీలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చేలా కృషిని వేగవంతం చేసినట్టు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగానే దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ డ్రోన్‌ మేళాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం డ్రోన్‌ మేళా జరగనుందని చెప్పారు. కొత్త టెక్నాలజీలో దేశం అగ్రగామిగా నిలవాలని మోదీ ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇప్పటికే గుజరాత్‌, ఉత్తరాఖండ్‌లలో డ్రోన్‌ మేళాలు నిర్వహించినట్టు చెప్పారు. ఈ మేళాలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, టెక్నాలజీ సంబంధిత డ్రోన్లను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. పౌర విమానయాన సంస్థ, ఫిక్కీ ఆధ్వర్యంలో మాధవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో నిర్వహించే ఈ మేళాకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తదితరులు హాజరవుతారని చెప్పారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని