
టైమ్స్ స్క్వేర్.. ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు!
కరోనాతో జనాలు లేక వెలవెలబోయింది
న్యూయార్క్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వెలవెలబోయింది. అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడు ఆ టైమ్స్ స్క్వేర్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఆ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
* రెండో ప్రపంచ యుద్ధం తరవాత నుంచి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఖాళీగా లేదు.
* హారర్ సినిమాను తలపిస్తోంది.
*టైమ్స్ స్క్వేర్ ఖాళీగా ఉంది. మరోసారి ఇలా చూడకూడదని ఆశిస్తున్నాను అంటూ నెట్టింట్లో స్పందన వచ్చింది.
ఇవీ చదవండి:
ఆహ్వానం 2021..అనూహ్య ప్రపంచానికి!
2020లో..కరోనా మోసుకొచ్చిన కొత్త పదాలు!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.