Viral video: ప్రముఖ గాయకుడిపై కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్‌

గుజరాత్‌లో గో సంరక్షణ కోసం నిర్వహించిన భజన కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు కీర్తిదన్‌ గధ్వీపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఈ డబ్బునంతటినీ ఛారిటీకే ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.

Updated : 12 Mar 2023 19:17 IST

వల్సాద్‌(గుజరాత్‌): ప్రముఖ జానపద గాయకుడు కీర్తిదన్‌ గధ్వీ(Kirtidan Gadhvi)పై అభిమానులు కరెన్సీ నోట్ల(Currency notes) వర్షం కురిపించారు. ఓ ప్రత్యేక భజన కార్యక్రమంలో ఆయన ఆలపించిన గానానికి ఫిదా అయి కరెన్సీ నోట్లు వెదజల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఆ వేదికంతా కరెన్సీ నోట్లతోనే నిండిపోయింది. ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేశారు. కీర్తిదన్‌ గధ్వీపై నోట్లు విసురుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కీర్తిదన్‌ పట్ల జనం చూపిస్తోన్న అభిమానానికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..  గుజరాత్‌లోని వల్సద్‌లో శనివారం రాత్రి అగ్నివీర్‌ గో సేవా దళ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఆవులకు సేవ కోసం నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కీర్తిదన్‌ హార్మోనియం వాయిస్తూ  పాటలు ఆలపించారు. దీంతో అక్కడకు విచ్చేసిన వందలాది మంది అభిమానులు ఆయన గాత్రానికి ముగ్ధులై పొడియం వద్దకు చేరుకొని రూ.10, రూ.20, రూ.20, రూ.50, రూ.100 నోట్లతో ముంచెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బునంతటినీ ఛారిటీకే ఇవ్వనున్నట్టు కీర్తిదన్‌  వెల్లడించారు. మరోవైపు, గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. గతంలోనూ పలువురు గాయకులపై డబ్బులు వెదజల్లిన ఘటనలు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని