Nitin Gadkari: అమితాబ్‌ సినిమా మూడుసార్లు చూశా: గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

మిగతా నటీనటుల యాక్టింగ్ నచ్చినప్పటికీ.. అమితాబ్‌ బచ్చనే (Amitabh Bachchan) తనకు ఇష్టమైన నటుడని భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. 

Published : 19 Mar 2024 15:37 IST

దిల్లీ: ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చనే(Amitabh Bachchan) ఎప్పటికీ తన ఫేవరెట్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. ‘న్యూస్‌ 18’ నిర్వహిస్తోన్న రైజింగ్ భారత్‌ సమ్మిట్ 2024లో ఇలా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించే కాకుండా తన ఇష్టాలను వెల్లడించారు.

ఈ సమ్మిట్‌లో వ్యాఖ్యాత కొందరు బాలీవుడ్ నటీనటుల ఫొటోలను గడ్కరీకి చూపించారు. వారిలో రణబీర్ కపూర్, రణ్‌వీర్‌ సింగ్, విక్రాంత్‌ మస్సే, అలియా భట్‌, కియారా అడ్వాణీ, తాప్సీతో సహా పలువురు తారల చిత్రాలున్నాయి. ‘‘వీరిలో మీరు అభిమానించే నటీనటులు ఎవరు..?’’ అని ప్రశ్నించారు. ‘‘వీరి అందరి యాక్టింగ్ నచ్చుతుంది. కానీ అమితాబ్‌ బచ్చన్‌ ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో. మేమంతా ఒక తరానికి చెందినవాళ్లం. నేను అమితాబ్‌ ట్రెండ్ ఫాలో అయ్యేవాడిని. జంజీర్ చిత్రాన్ని మూడుసార్లు చూశానని ఓ సందర్భంలో ఆయనకు చెప్పాను. మరో చిత్రం ఆనంద్‌ను మూడునాలుగు సార్లు చూశాను. ఆయన యాక్షన్ చిత్రాలంటే నాకు ఇష్టం’’ అని మంత్రి సరదాగా సంభాషించారు.  

ఈసందర్భంగా తాను తగిన పార్టీలో లేనంటూ విపక్షాలు చేసే విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘నాలాంటి వ్యక్తి భాజపాకు తగరని చేస్తోన్న వ్యాఖ్యలు పూర్తిగా తప్పు. పార్టీ, నేను రెండూ సరైనవే. ఆర్‌ఎస్‌ఎస్‌తో నాకు అనుబంధం ఉంది. ఒక విద్యార్థి నాయకుడిగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ రోజు మీరు నాలో చూస్తున్న మంచి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి నేర్చుకున్నదే’’ అని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని